రకుల్ ప్రీత్ సింగ్ రానాలో లవ్వులో ఉందట.. ఎక్కడికెళ్లినా పక్కనే ఉంటాడట..!

మంగళవారం, 12 జులై 2016 (11:55 IST)
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి సూపర్ హిట్స్ సినిమాల్లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. డేటింగ్‌లో ఉన్న రకుల్ ఎక్కడికి వెళ్ళినా న ఆ హీరో తోడుగా ఉంటున్నాడట.
 
రకుల్ ఇటీవల ఓ డిన్నర్‌కు వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా ఆ హీరో ఆమె పక్కన ఉంటున్నాడట. అంతేకాదు వారిద్దరూ బెంగుళూరు ప్రో కబడ్డీ మ్యాచ్ వద్ద కూడా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట. ఇంతకు అతనెవరో కాదు దగ్గుపాటి రానా. తాజాగా వీరిద్దరూ రెండురోజుల పాటు బెంగుళూరులోనే మకాం వేశారని తెలుస్తుంది. 
 
అంతకుముందు ఆదాబ్ రెస్టారెంట్ లో ఇద్దరూ కలసి కనిపించినట్లు సమాచారం. ఇంకా రకుల్ హైద‌రాబాద్‌లో ప్రారంభించిన జిమ్ ప్రారంభోత్స‌వానికి కూడా రానా వెళ్లాడు. ఇక ఆమె హైద‌రాబాద్‌లో కొన్న ఇంటికి కూడా రానా హెల్ఫ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి