తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన కంగనా.. 'మా తాత సర్జుసింగ్ రాజ్‌పుత్ హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయాలలో పని చేసారు. అయితే ఇప్పుడు నన్ను చాలా పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. నా మాటల ద్వారా యువతపై మంచి ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. కానీ నేను ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తే అన్ని వైపులా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతాను.
ప్రస్తుతం ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరికలు చాలా ఎక్కువైపోతున్నాయి. కానీ మన అదృష్టం ఏంటంటే.. రక్తపాతాలు లేవు. కేవలం ఒకరిపై ఒకరు బురద జల్లుకునే సంఘటనలే జరుగుతున్నాయి. ఒకవేళ నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చినా నిస్వార్ధంగా, పార్టీకే కట్టుబడి పనిచేస్తాను' అని చెప్పుకొచ్చారు. మరి ఇది తనను ఏదైనా పార్టీ పిలవాలనే అభ్యర్థనతో కూడిన విన్నపమేమో రాజకీయ పక్షాలు కొంచెం ఆలోచించాల్సి ఉంది.