బారికేట్ల‌ను తోసుకుంటూ ఉప్పొంగిన అఖండ అభిమానం

శనివారం, 12 మార్చి 2022 (18:28 IST)
Akhanda Abimanam
నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అఖండ‌` చిత్రం 20 థియేట‌ర్ల‌లో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబ‌ర్ 2న విడుద‌లై క‌రోనా స‌మ‌యంలోనూ ఊహించ‌ని విజ‌యాన్ని సాధించ‌డం బాల‌కృష్ణ‌లోని ప్ర‌త్యేక‌త‌గా అభిమానులు తెలియ‌జేస్తున్నారు. అందుకే వంద‌రోజుల వేడుక‌ను క‌ర్నూలులో జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది.
 
అఖండ వంద రోజుల‌ కృత‌జ్ఞ‌త‌ స‌భ శ‌నివారం సాయంత్రం క‌ర్నూలు న‌గ‌రంలోని ఎస్‌టి.బి.సి. కాలేజీలో.ఘ‌నంగా జ‌రిగింది. ఆనందోత్సాహాల‌తో క‌ర్నూలు, ఎమ్మిగ‌నూరు, ప‌త్తికొండ‌, ఆదోనీ, విజ‌య‌వాడ‌, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్న‌పిల్ల‌ల నుంచి మ‌హిళ‌లు, పెద్ద‌లు సైతం `జైబాల‌య్య‌` అంటూ నిన‌దించారు. భారీ ఎత్తున ఏర్పాటుచేసిన భారికేట్ల‌ను సైతం తోసుకుంటూ స‌భా ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశిస్తూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేసుకున్నారు. అఖండ గెట‌ప్‌లో ఆదోనీకి చెందిన రంగ‌య్య ఈ సంద‌ర్భంగా త‌న ఊరిలో పేరు తెచ్చుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు