కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

సెల్వి

బుధవారం, 1 అక్టోబరు 2025 (19:49 IST)
ప్రేమజంట మృతి కాకినాడలో సంచలనం సృష్టిస్తోంది. సామర్లకోట మండలం, పనసపాడులో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి మృతదేహం పనసపాడు శివారులోని ఆలయం వద్ద లభ్యమవగా.. ఆమె ఒంటిపై గాయాలు, కత్తిపోట్లతో గల మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
యువకుడి మృతదేహాం హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్ దగ్గర లభ్యమైంది. మృతులను గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన దీప్తి, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ జంట మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందా అన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మృతుడు ఆశోక్ పై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ముందుగా అశోక్ ప్రియురాలు దీప్తి  గొంతుకోసి.. ఆ తర్వాత తాను రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు. దీప్తి స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా... అశోక్ చెన్నైలో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు