అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ రెండో సినిమాపై పూర్తిగా దృష్టి సారించాడు. పెళ్లి కాస్త రద్దు కావడంతో.. తొలి సినిమా అంత హిట్ కాకపోవడంతో.. ఇక పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందానికి అందం ఉండగా, చక్కని అభినయంతో ఎలాగైనా రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ద్వారా మంచి మార్కులు వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇక రికార్డు సంగతికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలులో జరుగుతోంది. దీంతో ఇంకా ప్రారంభం కాని హైదరాబాద్ మెట్రో రైల్‌లో షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రంగా అఖిల్ సినిమా రికార్డ్ సృష్టించింది. ''మనం'' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నాగార్జున ఈ సినిమా విషయంలో విక్రమ్ కుమార్ కు బడ్జెట్ పరిమితులు ఇవ్వకుండా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పేశాడు. దీంతో అఖిల్ రెండో మూవీ కచ్చితంగా హిట్ కాక తప్పదని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు.