పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేసిన రేణూ దేశాయ్.. పవన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారా అన్నట్లు ఆమె కామెంట్స్ ఉన్నాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తనకు తానుగా అకీరా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని రేణూ దేశాయ్ ట్వీట్ చేశారు. అంతేకానీ.. ఎన్నటికీ జూనియర్ పవర్ స్టార్‌గా అకీరా ఉండకూడదన్నారు.
అకీరా పట్ల తనకు ఆ నమ్మకం ఉందని.. ''హ్యాపీ బర్త్ డే మై లిటిల్ స్వీట్ హార్ట్ అకీరా'' అని రేణు దేశాయ్ ట్వీట్ పెట్టారు. అకీరా 13 ఏళ్ల వయసులోనే ఆరు అడుగుల ఎత్తు పెరగడాన్ని నమ్మలేకున్నానని కూడా వరుస ట్వీట్ల ద్వారా రేణు చెప్పారు. తమ కుమారుడు పదమూడవ యేట అడుగు పెట్టిన ఆనందంలో ఉన్న ఆ తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇంకా అకీరా టీనేజ్‌లో అడుగుపెడుతున్నాడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పింది.
కాగా.. గత నెల తన కూతురు ఆద్య పుట్టిన రోజు వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. మాజీ భార్య రేణు దేశాయ్ నివాసంలో జరిగిన వేడుకకు పవన్ హాజరయ్యారు. కొద్దిరోజులకే తన మరో కూతురు బర్త్ డే వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. కానీ అకీరా బర్త్ డే వేడుకల్లో పవన్ కనిపించలేదు. మరి అందుకేనేమో రేణు పవర్ స్టార్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ... అకీరా నందన్ మరో పవర్ స్టార్‌లా కాకూడదని వ్యాఖ్యానించి వుంటారని సినీ పండితులు అంటున్నారు.