Trivikrama Rao Kundurthi, Pratani Ramakrishna Goud, Guru Raj
త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్, ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.