బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఇకలేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె బుధవారం కన్నుమూశారు. ఆమె మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. ఈ నెల 6వ తేదీన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
'బెల్‌బాటమ్' చిత్రం ద్వారా ఇటీవల థియేటర్లలోకి వచ్చిన అక్షయ్ కుమార్... సూర్యవంశీ, బచ్చన్ పాండే, అత్రాంగీ రే, పృథ్వీరాజ్, రామ్‌సేతు, రక్షా బంధన్ తదితర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాయి.