'అల వైకుంఠపురములో' షార్ట్ టీజర్ రిలీజ్, బూతులు తిడుతున్న ఫ్యాన్స్, ఎందుకు?-video

సోమవారం, 9 డిశెంబరు 2019 (16:18 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో..' చిత్రం విడుదలయ్యే వరకూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో రకంగా ఆ చిత్రానికి సంబంధించి చిన్నచిన్న ముక్కలను వదులుతున్నారు. ఈరోజు కూడా అల వైకుంఠపురములో ఓ చిన్న టీజర్‌ ముక్కను విడుదల చేశారు. దీన్ని చూసిన అల్లు ఫ్యాన్స్ కొందరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి కారణం వేరే వుందనుకోండి.
 
ఉదయం నుంచి ఎదురుచూస్తే మాకు అల్లు అర్జున్ చొక్కా వేసుకోవడం, బూట్లతో నడవడం చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఐతే అసలు టీజర్ డిసెంబరు 11 సాయంత్రం రిలీజ్ అవుతుంది. మరి అల్లు ఫ్యాన్స్ అప్పటివరకూ ఆగలేకపోతున్నారు. ఇక్కడ చూడండి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షార్ట్ టీజర్...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు