ఈ రోజు చాలా గొప్పగా ఫీలవుతున్నాను.. జక్కన్నకు ధన్యవాదాలు : అలియా

గురువారం, 14 మార్చి 2019 (15:46 IST)
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆలియా భట్ చాలా బిజీ హీరోయిన్. అంతేకాకుండా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువే. తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్‌లో రామ్‌చరణ్ సరసన ఆలియా నటిస్తోందని రాజమౌళి వెల్లడించడంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆలియా తొలిసారి ఈ సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
 
ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినందుకు అలియా ట్విట్టర్ వేదికగా రాజమౌళికి ధన్యవాదాలు తెలియజేసారు. 'ఈరోజు గొప్పగా ఫీలవుతున్నాను, గొప్ప నటులు, అద్భుతమైన చిత్ర బృందంతో కలిసి పనిచేసే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ రాజమౌళి సార్' అని ట్విట్టర్ ద్వారా రాజమౌళికి ధన్యవాదాలు తెలిపింది. 
 
అయితే ఈ సినిమాలో ఆలియా హీరోయిన్ అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నప్పటికీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు నో చెప్పిందనే వదంతులు కూడా రావడంతో ఈ సినిమాలో ఆమె నటిస్తుందో లేదో అన్న అనుమానాలు తలెత్తాయి. తాజా ప్రెస్‌మీట్‌తో రాజమౌళి అలాంటి వదంతులన్నింటికీ బ్రేక్ వేసేసాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు