చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చే సినీ ఛాన్సుల్లోని పాత్రలకు అనుగుణంగా తమ శరీరాకృతిని కూడా మార్చుకుంటుంటారు. ముఖ్యంగా, బరువు పెరగడం, తగ్గడం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటి తన తొలి చిత్రం కోసం ఏకంగా 16 కేజీల బరువు తగ్గింది. ఆ నటి పేరు అలియా భట్. ఈమె నటిస్తున్న తాజా చిత్రం 'రాజీ'. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2018లో విడుదల కానుంది.
అయితే, అలియాభట్ సినిమాల్లోకి రాకముందు 67 కిలోల బరువుండేది. తన తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కోసం సుమారు 16 కిలోల బరువు తగ్గింది. మూడు నెలల వ్యవధిలోనే ఆమె బరువు తగ్గడం విశేషం. దీనిగురించి అలియా మాట్లాడుతూ ‘నా చేతులు ఎంత లావుగా అయిపోయాయో.. నేను గ్రహించలేకపోయాను. దీంతో యాబ్స్‌ను అనుసరించాను. ఫలితంగా హెల్త్, ఫిట్‌నెస్‌పై మరింత నమ్మకం పెరిగింది’ అని చెప్పింది. అలియా భట్ ప్రస్తుతం ప్రతీరోజూ క్రమం తప్పక జిమ్, వ్యాయామం, యోగాలను చేస్తుందట. దీనికి సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.