దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేయడం పట్ల బాలీవుడ్ నటి అలియా భట్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నల్లధనం అరికట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మోడీకి అండగా ఉండాలని, అదేసమయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సహచర నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వినికిడి. అయితే, ఒక వేళ తన లవ్ బ్రేకప్ అయితే ఎలా ఫీలవుతారు, ప్రవర్తిస్తారన్న అంశంపై ఆమె స్పందిస్తూ... "నేను 16 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్ బాధలోంచి తేరుకోవడానికి స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా.