రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైయింది. నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో కథా నేపధ్యాన్ని చాలా ఆసక్తికరంగా రివిల్ చేశాడు దర్శకుడు. తిరుపతిలో ఫోటోల షాపు పెట్టుకోవాలని తపించే హీరో, అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై చాలా క్యూరీయాసిటీని పెంచాయి.
నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నటీనటులు: రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ, సంగీతం : ఫణి కళ్యాణ్, ఎడిటర్ : సత్య గిడుతూరి