17 సంవత్సరాల క్రితం ఒక యువకుడు అందరిలానే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు.. సినిమా పరిశ్రమలో నిలబడ గలడా, లేడా అనే విషయం కూడా అప్పుడతనికి తెలీదు.. కానీ, పట్టుబట్టి మరీ తన మనసు ఏం చెప్పిందో అదే విన్నాడు.. 2002 మే 10న ఆ కుర్రాడు 'అల్లరి నరేష్'గా మరోసారి పుట్టాడు. అల్లరి సినిమా ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసేలా చేసింది.
చూడడానికి అందంగా లేని నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు తానెప్పుడూ వారికి రుణపడి ఉంటాను. ఇప్పుడెందుకీ విషయం చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకిలా మాట్లాడుతున్నాను అంటే, దానికి కారణం 'రవి'.. అల్లరి సినిమాలో తన క్యారెక్టర్ పేరు 'రవి', మహర్షిలోనూ 'రవి'నే.. ఈ 55 సినిమాల తన ప్రయాణం.. తన జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపిందన్నాడు. తను ఎదుగుదలకు కారణమైన చిత్ర పరిశ్రమకు.. తనపై నమ్మకం వుంచిన నిర్మాతలు, దర్శకులకు, సాంకేతిక సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదులు తెలుపుకుంటున్నానని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.