ఈరోజుఈ సినిమా టైటిల్‌ను ఒక స్పైన్ చిల్లింగ్ టీజర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 12A రైల్వే కాలనీ అని ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు, టీజర్ సినిమా కథను గ్లింప్స్ లా ప్రజెంట్ చేసింది. అల్లరి నరేష్ ఒక కిటికీ దగ్గర నిలబడి, ఆలోచనలో, ధ్యాన ముద్రలో కనిపించడంతో టీజర్ బిగెన్ అవుంతుంది. వైవా హర్ష వాయిస్ ఓవర్‌లో కొంతమందికి మాత్రమే ఆత్మలు ఎందుకు కనిపిస్తాయో, రాబోయే అతీంద్రియ అంశాలను ఎందుకు సూచిస్తుందో ప్రశ్నిస్తుంది.
టీజర్ వింతైన, కలవరపెట్టే సంఘటనలు ఎక్సయిటింగ్ గా వున్నాయి, ప్రతి పాత్ర కూడా అనుమానాస్పదంగా వుంది. అల్లరి నరేష్ పాత్ర ఒకరిని షూట్ చేసి నవ్వడం ప్రేక్షకులను ఆ పాత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా వుంది.
అల్లరి నరేష్ డిఫరెంట్ షేడ్స్‌తో మరో ఆసక్తికరమైన పాత్రను పోషించగా, పోలిమేరా సిరీస్ ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.