అల్ల‌రి న‌రేష్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:49 IST)
Allari Naresh, Anandi clap by Balu Munnangi
కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. అల్లరి న‌రేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్‌ను బాలు మున్నంగి కొట్ట‌గా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా వెంక‌ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు