సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్'. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన విమర్శకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు. ఇప్పుడీ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది 'జీ 5'.