స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త ఇంటి కోసం భూమి పూజా కార్యక్రమం ప్రారంభించారు. సాధారణంగా తన రెగ్యులర్ లైఫ్‌ని స్టైలిష్‌గా డిజైన్ చేసుకునే బన్నీ కొత్త ఇంటి విషయంలో కూడా అలాంటి ప్రణాళికలతోనే సిద్దమైనట్లు సమాచారం. తన ఫ్యామిలీతో కలిసి భూమి పూజ చేసిన అల్లు అర్జున్ అభిమానులతో ఆ ఫోటోని షేర్ చేసుకున్నాడు.
ఇంతకీ తన కొత్త ఇంటికి అల్లు అర్జున్ ఏమని పేరు పెట్టారో తెలుసా..? బ్లెస్సింగ్ అని నామకరణం చేశారు. కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న అల్లు అర్జున్‌కు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురములో అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.