పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గతంలో వివాదం రావడం... ఆ తర్వాత బన్నీ క్లారిషికేషన్‌తో కూల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిమధ్య వివాదం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. మే 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే... అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ డైలాగ్ ఇంపాక్ట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ టీజరే వివాదస్పం అవుతోంది. ఈ టీజర్‌లో అల్లు అర్జున్ సౌతిండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ , వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా అనే డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ పవన్‌ని టార్గెట్ చేస్తూ పెట్టారంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా సార్లు సౌతిండియా అంటే నార్త్ ఇండియా వారికి చిన్నచూపు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.