స్నేహ రెడ్డితో ఢిల్లీకి వెళుతున్న అల్లు అర్జున్

సోమవారం, 16 అక్టోబరు 2023 (20:12 IST)
Sneha Reddy, Allu Arjun
తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నేడు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈరోజు కనిపించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్యం అవార్డులు ప్రకటించింది. పుష్పకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. దాని అందుకోబోతున్న నటుడిగా ఈరోజు ఎయిర్ పోర్ట్ లో చాలా ఖుషీగా కనిపించారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాగానే ఇప్పుడు ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌మోష‌న్లను దర్శకుడు వినూతనముగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్ది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు