కష్టపడుతున్న అల్లు అర్జున్‌... అర్థరాత్రి 2 గంటల వరకూ...

శుక్రవారం, 20 జనవరి 2017 (19:38 IST)
అల్లు అర్జున్‌కు కష్టపడటమంటే చాలా సరదా అట. బాడీని ఎంతైనా కష్టపెట్టడానికి సిద్ధపడతాడని గతంలో చిరంజీవి కూడా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. డాన్స్‌లో ఒక శైలి తెచ్చుకున్న అర్జున్‌ ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' చేస్తున్నాడు. గత సంవత్సరం ఆఖరులో మొదలైన ఈ చిత్ర షూటింగ్‌ బన్నీకి కూతురు పుట్టడం, చిరు 150వ చిత్రం 'ఖైదీ నెం 150' విడుదల, సంక్రాంతి పండుగ వంటి కారణాల వలన ఆలస్యయింది. 
 
దాన్ని కవర్‌ చేసి అనుకున్న సమయానికే సినిమాను పూర్తిచేయాలని బన్నీ టీమ్‌ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతోంది. గురువారం అర్థరాత్రి 2 గంటల వరకు షూటింగ్‌ చేయడం అందులో భాగమని చిత్ర యూనిట్‌ చెబుతోంది. అల్లు అర్జున్‌, హీరోయిన్‌ పూజా హెగ్డేలపై పలు కీలక సన్నివేశాల చిత్రీకరించారు. ఇకపై కూడా ఇలాగే బిజీ షెడ్యూల్స్‌ జరుగుతాయని తెలుస్తోంది. ఈ సినిమాను వేసవికి రిలీజ్‌ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి