ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించి బన్నీ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఆడియో రిలీజ్ పెట్టుకుంటే బాగుంటుందని ఈ సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, ఆ రోజు వీలుపడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఇంకా వీడలేదు.
మరోవైపు, ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కూడా చర్చిస్తున్నారు. భాగ్యనగరంలో ఈ ఫంక్షన్ జరిపితే రొటీన్‌గా ఉంటుందనీ అందువల్ల వైజాగ్‌లో జరుపుదామని అనుకుంటే .. ఇంతకుముందే అక్కడ 'రంగస్థలం' ఫంక్షన్ జరిపారు. అందువలన అల్లు అర్జున్ చిత్రం ఆడియో వేడుకను 'తిరుపతి'లోగానీ .. కర్నూల్లోగాని జరపాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సంగతి పక్కనబెడితే చిత్రం మాత్రం మే 4వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.