ఆన్‌లైన్ ఫోటో సేవలను ప్రారంభించిన అల్లు అర్జున్

సోమవారం, 5 సెప్టెంబరు 2016 (14:47 IST)
అల్లు అరవింద్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. వ్యాపార రంగంలోకి పలువురు మహిళలు రాణిస్తున్న నేపథ్యంలో అయితే స్నేహరెడ్డి కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తన అభిరుచి మేరకు ఓ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది. ఫోటోగ్రఫీని ఎంచుకోవడంలో కూడా కారణం లేకపోలేదు.
 
ధనవంతుల కుటుంబాలు తమ పిల్లలను, మరింత అందంగా చూపించుకోవాలని తపన పడే వాళ్ళ కోసం పికాబు అనే సంస్థ పని చేస్తుంది. దీంతో అల్లు అర్జున్ - స్నేహరెడ్డిలు కూడా తమ తనయుడు అయాన్‌ని ఇదే చోట ఫోటోలు తీయించారు. ఆ సంస్థని కొనుగోలు చేసి అధిపతి అయ్యింది స్నేహరెడ్డి. దాంతో ఇదే విషయాన్నీ తెలియజేస్తూ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్ .

వెబ్దునియా పై చదవండి