సంక్రాంతి నుంచి సంక్రాంతికి అలవైకుంఠపురములో, బుట్టబొమ్మ పూజా హెగ్డె

సోమవారం, 11 జనవరి 2021 (23:11 IST)
సంక్రాంతి నుంచి సంక్రాంతి వరకూ తనకు ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చిన చిత్రం అలవైకుంఠపురములో అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. అలవైకుంఠపురములో చిత్రం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హైదరాబాదులో చిత్ర యూనిట్ రియూనియన మీట్ ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ... సంక్రాంతి నుంచి ఇప్పటివరకూ బ్యాడ్ ఇయర్. కానీ నా వరకూ 2020 గుడ్ ఇయర్. లాక్ డౌన్‌లో ఇంట్లో కూర్చున్నా కూడా నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఒక్క సెకను కూడా బోర్ కొట్టలేదు. ఆ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకూ నేను హ్యాపీ. ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేందుకు నాకు 20 సినిమాల సమయం పట్టింది.
నాకు నేను గుర్తుకు రాని పాట బుట్టబొమ్మ పాట. నీతో హ్యాట్రిక్ చేయాలని వుంది పూజా" అని చెప్పారు అల్లు అర్జున్. కాగా బుట్టబొమ్మ పూజా హెగ్డె రావడంతోనే అందరికీ అభివాదం అంటూ హుషారెత్తించింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు