ఈరోజు అల్లు అర్జున్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మీతో ఒక ఫోటో దిగి దాన్ని ట్వట్టర్‌లో పోస్ట్ చేసాడు బన్నీ. బ్రహ్మీని రియల్ ఐరన్ మ్యాన్‌గా పేర్కొంటూ నా కిల్ బిల్ పాండే దాన్ని కిల్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చమత్కారంగా పోస్ట్ చేసారు. ఏదేమైనా బన్నీ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడని అభిమానులు సంతోషిస్తున్నారు.