అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

ఐవీఆర్

సోమవారం, 16 డిశెంబరు 2024 (12:42 IST)
అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్, ఆయనలో విపరీతమైన ఫైర్ వుంది, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత కూడా వుంది అంటూ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పిన వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్‌కి రాజయోగం వుందని వేణుస్వామి చెప్పడాన్ని ఇప్పటికే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాజయోగం అంటే జైలుకి వెళ్లడమా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా వేణుస్వామి తను చెప్పే జాతకాలతో ప్రత్యేకించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు.
 
గతలో ప్రభాస్ గ్రాఫ్ పడిపోతుందనీ, బాహుబలి తర్వాత ఆయన చిత్రాలు ఇక ఏమీ ఆడవని చెప్పారు. ఐతే ప్రభాస్ నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడంతో వేణుస్వామి ట్రోల్ కి గురయ్యారు. అంతేకాదు... గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తిరిగి సీఎం అవుతారని చెప్పారు. కానీ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక అప్పట్నుంచి ఆయన జాతకాలు చెప్పడాన్ని కాస్తంత తగ్గించేసారు.

జైలుకి వెళ్లిన వాళ్లందరూ సీఎం అవుతారు కాబట్టీ, #AlluArjun కూడా సీఎం అవుతాడు. %అల్లు అర్జున్ పార్టీ పెడతారు

:- #VenuSwamypic.twitter.com/5gDJSlLvkn

— Milagro Movies (@MilagroMovies) December 15, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు