భావి తరాలకు పచ్చదనంతో కూడిన పర్యావరణం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అమితాబ్. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు బిగ్‌బీ. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే కదా.
ఈ కార్యక్రమంలో బిగ్‌బీతో పాటు ఎంపీ సంతోష్, సినీ హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మొక్క నాటిన తర్వాత ఆయనతో కలిసి ఎంపీ సంతోష్ ఓ సెల్ఫీ తీసుకున్నారు.