థ‌మ్స్ అప్ యాడ్ వ‌ల్ల మ‌హేష్ యూత్‌కు ఏం చెప్ప‌ద‌లిచాడు?

శనివారం, 24 జులై 2021 (21:00 IST)
Mahesh add
హీరోలు ఏది చేస్తే అభిమానులు అదే చేస్తారు. హీరోల వ్య‌క్తిగ‌తం ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా యూత్‌లో చాలా ప్ర‌భావం చూపుతుంది. ఇదివ‌ర‌కు ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే జ‌రిగాయి. తాజాగా మ‌హేష్‌బాబు కూల్ డ్రింగ్ యాడ్ చేశాడు. థ‌మ్స్ అప్ యాడ్ అది. ఈ థ‌మ్స్ అప్ యాడ్ గ‌తంలో అమితాబ్ కూడా చేశాడు. దేశ వ్యాప్తంగా దానిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆయ‌న దానిని ఆ త‌ర్వాత విర‌మించుకున్నారు. ఒక‌వైపు పార్ల‌మెంట్‌లోనూ ఆయ‌న ఈ యాడ్‌పై విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. సెల‌బ్రిటీలు ఇలాంటి యాడ్స్ చేసేట‌ప్పుడు ఒక‌టి రెండుసార్లు ఆలోచించి చేయాల‌ని అప్ప‌ట్లో సెల‌బ్రిటీలు అనుకున్నారు. 
 
Mahesh add
ఆమ‌ధ్య సాయిప‌ల్ల‌వి కూడా ఫేస్ క్రీమ్ యాడ్ చేయ‌డానికి ఓ కంపెనీ రెండు కోట్లు ఆఫ‌ర్ చేస్తే తాను ఇలాంటివి చేయ‌న‌ని సున్నితంగా తిర‌స్క‌రించింది. ఇది మొహానికి రాసుకుని ఎవ‌రైనా స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంటే దానికి బాధ్యురాలిని నేను అవుతాన‌ని సోష‌ల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇక కూల్ డ్రింక్ యాడ్స్ అనేవి కోట్ల రూపాయ‌ల పారితోషికం వ‌స్తాయి. దానికోస‌మే సెల‌బ్రిటీలు చేస్తుంటార‌నేది టాక్‌.
 
ఇటీవ‌లే హాలీవుడ్‌లో కారు రేస్‌లో పాల్గొనే ఓ క్రీడాకారుడు కూడా మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతుండ‌గా ఓ కూల్‌డ్రింగ్‌ను ఆయ‌న ముందు పెడితే తిర‌స్క‌రించాడు. మంచినీరు బెట‌ర్ అంటూ వాటినే తాగాడు. దాంతో ఆ కూల్‌డ్రింక్ సేల్స్ ప‌డిపోయాయి. కోట్ల న‌ష్టం అనేది త‌ర్వాత సంగ‌తి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌నివాటికి ఇలా వ్యాపార‌వేత్త‌లు ఎందుకుకొస్తారని అక్క‌డ మీడియా ప్ర‌శ్నించింది. 
 
ఇప్పుడు తాజాగా మ‌హేష్‌బాబు థ‌మ్స్ అప్ యాడ్ చేస్తున్నాడు. ఈసారి కూల్‌గా కూర్చుని బాటిల్ ప‌ట్టుకుని, ఆ త‌ర్వాత తాగాక ఖాలీ బాటిల్‌ను కింద‌కు చూపిస్తూ క‌నిపించాడు. అయితే దీనిపై నెటిజ‌న్లు ర‌ర‌కాలుగా స్పందిస్తున్నా, మ‌హేష్ ఇటువంటివి చేయ‌క‌పోవ‌డం బెట‌ర్ అని విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు. ఇదే కూల్‌డ్రింక్‌ను కొండ‌ల‌పై బైక్‌లో, ఆకాశంలో జంప్ చేస్తూ ఇలా ఫీట్లు చేస్తూ తాగిన యాడ్స్ వున్నాయి. పైగా ఆ త‌ర్వాత ఇలాంటివి ప్ర‌యోగాలు చేయ‌వ‌ద్ద‌ని యాడ్ నిర్వాహ‌కులు ఓ స్ల‌యిడ్ కూడా వేశారు. మ‌రి కూల్ డ్రింక్ తాగితే ఎందుకు వేయ‌ర‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ యాడ్ వ‌ల్ల మ‌హేస్ ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కార్ రేస్ క్రీడాకారుడు వ‌ద్ద‌ని చెప్పినా అది మ‌హేష్‌కు ప‌ట్ట‌లేదా అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జ‌రుగుతుందో.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు