పెళ్లైనా అమలా పాల్‌కు తగ్గని క్రేజ్.. అమ్మా కనక్కులో లుక్ అదుర్స్ (వీడియో)

గురువారం, 9 జూన్ 2016 (13:22 IST)
ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలాపాల్ పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటిస్తూ.. మంచి పేరు కొట్టేస్తుంది. తమిళ దర్శకుడిని పెళ్లాడిన ఈ భామ ఇటీవల పసంగ 2 చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా తమిళ సినిమా అమ్మా కనక్కులో అమలాపాల్ వెరైటీలో రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మించారు. 
 
2016లో వచ్చిన ‘నిల్ బట్టే సన్నాటా’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అశ్విని లయర్ తివారి అమ్మా కనక్కు చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించినట్టు తాజాగా విడుదలైన ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. డైరక్టర్ సముద్రకని, రేవతి కీలక పాత్రలు పోషించే ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ట్రైలర్ ఎలా వుందో మీరూ చూడండి.
 

వెబ్దునియా పై చదవండి