అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ నటించిన ఊర్వశివో రాక్షసివో నుండి సాంగ్ రాబోతుంది
గురువారం, 6 అక్టోబరు 2022 (13:20 IST)
Allu Shirish and Anu Emmanuel
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.గీత గోవిందం, ప్రతిరోజు పండగే వంటి హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం "ఉర్వశివో రాక్షసివో".
కొత్తజంటతో జనాదరణ పొందిన అల్లు శిరీష్ తాజా సినిమా ఇది. చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది.ఇందులో భాగంగా అక్టోబర్ 10న "ఊర్వశివో రాక్షసివో" చిత్రం నుండి "దీంతననా" అనే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు.