యాంకర్ అనసూయకు కరోనా పాజిటివ్!

ఆదివారం, 10 జనవరి 2021 (14:43 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 
 
"ఈరోజు ఉదయమే కర్నూలు బయలుదేరడానికి సిద్ధమయ్యాను. అయితే నాలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. నా టెస్ట్‌ రిజల్ట్స్‌ గురించి తెలియజేస్తాను. రీసెంట్‌గా నన్ను కలిసిన వారందరూ ఓసారి టెస్ట్‌ చేయించుకోండి" అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. 
 
కాగా, అన్‌లాక్‌లో అనేక నిబంధనలతో కూడిన పరిమితులు ఇవ్వడంతో టాలీవుడ్‌ సెలబ్రిటీలు షూటింగ్స్‌, సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నా కూడా రీసెంట్‌టైమ్‌లో రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి స్టార్స్‌ కరోనా బారిపడ్డారు. ఇప్పుడు ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు కూడా కరోనా సోకింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు