అనసూయ ఆ విధంగా ఎక్కింది....

శనివారం, 16 జులై 2016 (16:19 IST)
బుల్లితెర యాంకర్‌ నుంచి వెండితెర నటిగా గుర్తింపు పొందిన అనసూయ.. తాజాగా ఫొటోషూట్‌ను చేపట్టింది. బుల్లితెరలో 'బూమ్‌బూమ్‌', 'ఆధునిక మహాలక్ష్మి', 'రచ్చ', జబర్‌దస్త్‌ల షోలో తన గ్లామర్‌తో ఆకట్టుకునే అనసూయ.. క్షణం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాల్లో అలరించింది. 
 
ఇటీవలే టీవీలో ప్రసారమైన 'క్షణం' చిత్రంలో ఆమె పోషించిన పాత్రకు పలువురు ముగ్ధులయ్యారట. ఈ విషయాన్ని ఆమె తెలియజేస్తూ... ప్రముఖ నిర్మాణసంస్థ తనతో ఓ సినిమా చేయడనికి సిద్ధమైంది. అందుకే కొత్తగా ఫొటోషూట్‌ ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. కాగా, ఈసారి గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్‌ వున్న పాత్రను పోషించనున్నట్లు త్వరలో వివరాలను తెలియజేస్తానంటోంది.

వెబ్దునియా పై చదవండి