యాంకర్ అనసూయతో కలిసి బార్‌లో ఆ పని కానించేసిన నటి...

సోమవారం, 24 అక్టోబరు 2016 (15:36 IST)
బార్ అంటే అదో మైకం, మత్తు ఆవహిస్తుంది తాగుబోతులకు. పొరబాటున అటుగా తాగుబోతుల దృష్టి పడితే పాకుతూ అయినా అక్కడికి వెళ్లిపోతారు. ఇక తాగుడు అనేది ఎన్ని సమస్యలకు మూలకేంద్రమో ఇక వేరే చెప్పక్కర్లేదు. మద్యపానంపై అనేక కార్యక్రమాలు సైతం వస్తుంటాయి. మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ఫలితాలపైన అనేక వ్యాసాలను కూడా చూస్తూ ఉంటాం. 
 
ఐతే తాజాగా యాంకర్ అనసూయ నిర్వహిస్తున్న అనసూయ మస్తీ చూసే చూపురులకు ఓ మత్తు షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటయా అంటే... ప్రముఖ టెలివిజన్ ఛానల్లో యాంకర్ అనసూయ... అనసూయ మస్తీ పేరుతో రకుల్ ప్రీత్ సింగ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఎక్కడో తెలుసా... ఏకంగా బార్‌లో. 
 
మరి ఆ ఇద్దరిలో బార్‌లో బిజీగా ఉన్న వారెవరో తెలియదు కానీ వేదికను బార్ నే చేసేసుకున్నారు. ఇదేదో వెరైటీ అనుకుంటున్నారేమో... ఇదే ట్రెండ్ సాగితే మాత్రం నెక్ట్స్ లెవల్ కల్లు కాంపౌండులు, పేకాట క్లబ్బులను కూడా ఇలాంటి ఇంటర్వ్యూలకు ఉపయోగించుకుంటారేమోననే కామెంట్లు వినిపిస్తున్నాయి. అనసూయ అంటే అంతేమరి. సమ్ థింగ్ స్పెషల్ ఉండాలిగా గురూ అని ఆమె సపోర్టర్స్ అంటున్నారనుకోండి. చూద్దాం అనసూయ నెక్ట్స్ వెంచర్ ఎలా ఉంటుందో...?

వెబ్దునియా పై చదవండి