బిగ్ బాస్ ఓవర్.. నాతోనే డ్యాన్స్ రెడీ: ఉదయ భానుతో రేణు సెల్ఫీ (ప్రోమో వీడియో)

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (16:27 IST)
బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ''నాతోనే డ్యాన్స్''అనే రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఈ ప్రోగ్రామ్‌లో చాలాకాలంగా వెండితెరకు దూరంగా వున్న నిర్మాత, పవన్ కల్యాణ్ సతీమణి రేణూ దేశాయ్, యాంకర్ కమ్ యాక్టర్ ఉదయభాను బుల్లితెరపై కనిపించనున్నారు. పవన్ కల్యాణ్ నుంచి దూరమై నిర్మాతగా వ్యవహరిస్తున్న రేణు దేశాయ్ ఈ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. 
 
ఆ షో సెట్స్‌లో రేణూ దేశాయ్ హ్యాపీగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్పటికప్పుడు రేణు దేశాయ్ పోస్టు చేస్తున్నారు. తాజాగా బ్యూటిఫుల్ ఉద‌య‌భాను, టాలెంటెడ్ జానీ మాస్ట‌ర్‌తో క‌లిసి సెల్ఫీ దిగాన‌ని రేణూ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది. 
 
ఇకపోతే.. ఈ షో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంద‌ని రేణూదేశాయ్‌ వెల్లడించింది. ఫ‌న్, రొమాన్స్‌, డ్యాన్స్‌, మ‌స్తీని మిస్ కాకండ‌ని పేర్కొంది. ఈ షో ద్వారా తిరిగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుండటం ఎంతో సంతోషాన్నిస్తుందని రేణు చెప్పుకొచ్చింది.
 



వెబ్దునియా పై చదవండి