మరో దక్షిణాది జంట ప్రేమ నుంచి సహజీవనం వరకు వెళ్లిపోయినట్లే అని రూఢి అవుతోంది. ఎవరి సినిమాలు వారు చేసుకుంటూనే గుట్టుగా ప్రేమాయణం నడుపుతున్న అంజలి, జై ఈ మధ్య బహిరంగంగానే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆన్లైన్ సాక్షిగా ప్రకటించేశారు. ఇటీవలే జై తన ప్రియురాలికి స్వయంగా కమ్మని దోసెలు చేసి పెట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ ఎంత ఘాటు ప్రేమయో అనేలా ప్రపంచం ముందు బయటపడిపోయారు.
చాలా కాలం తర్వాత అంజలి, జై బెలూన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను ముగించుకుని అంజలి మరో తెలుగు చిత్రం షూటింగుకు వెళ్లిపోయారు. అయితే ఇటీవల బెలూన్ చిత్ర షూటింగ్ స్పాట్లో నటుడు జై తనపుట్టిన రోజు వేడుకను జరుపుకుంటే అంజలి ఉన్నట్లుండి ఆ వేడుకకు వచ్చి జైకి స్వీట్ పెయిన్ కలిగించారు అంజలి.