ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మ‌రో బిగ్ ఈవెంట్‌

శనివారం, 10 ఏప్రియల్ 2021 (22:49 IST)
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో మ‌రో పెద్ద ఈవెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు దిల్‌రాజు ప్ర‌క‌టించారు. వ‌కీల్‌సాబ్ విడుద‌ల‌కుముందు శిల్ప‌క‌ళావేదిక‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు అనూహ్య‌స్పంద‌న వ‌చ్చింది. ఇక సినిమా విడుద‌ల త‌ర్వాత అంతే స్పంద‌న రావ‌డం ప‌ట్ల నిర్మాత‌గా దిల్‌రాజు చాలా హ్యాపీగా వున్నారు. అందుకే ప‌లు థియేట‌ర్ల‌ను ప‌ర్య‌టిస్తూ శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌ను సంద‌ర్శించారు.

ఆయ‌నతో పాటు చిత్రంలో న‌టించిన అంజ‌లి, అన‌న్య‌, ద‌ర్శ‌కుడు వేణుశ్రీ‌రామ్‌, త‌మ‌న్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వారంతా థియేట‌ర్లో ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి ఆనందించారు. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, క‌ళ్యాణ్‌గారు ఒక విష‌యం మీకు చెప్ప‌మ‌న్నారు. అంద‌రూ సేఫ్‌గా వుండండి. మాస్క్‌ల ధ‌రించండి. అస‌లే ఇప్పుడు క‌రోనా అని చెబుతున్నారు. ఈ విష‌యం మీకు మ‌రీమ‌రీ చెప్ప‌మ‌ని నాతో అన్నారు. అలాగే ఈ స్పంద‌న‌ను చూస్తుంటే క‌ళ్యాణ్‌గారితో బిగ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాను అని తెలిపారు.
 
అంజ‌లి మాట్లాడుతూ, నేను థియేట‌ర్లో మీతో పాటు చూడాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చాను. మీ కేరింత‌లు, విజిల్స్ మ‌ధ్య‌లో చూడాల‌నుకున్నా. చాలా సంతృప్తిగా వుంది. నేను ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారి అభిమానిని. ఆయ‌న సినిమాలో న‌టించ‌డం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా అంద‌రి కృషి. అంద‌రూ బాగా న‌టించారు. ఈ అవ‌కాశం ఇచ్చిన టీమ్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు