ఆహాలో ఆకట్టుకుంటోన్న జోజు జార్జ్ చిత్రం ఆంటోని

డీవీ

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (16:42 IST)
Antony - Joju George
మలయాళంలో మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్య జోజు జార్జ్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. గత ఏడాది వచ్చిన ‘ఆంటోని’ చిత్రంలో జోజు జార్జ్, కళ్యాణీ  ప్రియదర్శన్ నటన గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరిగాయి. ఇక ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూశారు.
 
ఫిబ్రవరి 23న ఆంటోని సినిమా ఆహాలోకి వచ్చింది. ఇక తెలుగు ఆడియెన్స్ ఆహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూసి ఆనందించొచ్చు. ఈ చిత్రం గత ఏడాది అంటే..  డిసెంబర్ 1, 2023న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి రివ్యూలతో పాటు, కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగులో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
 
ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ మీద ఆంటోని చిత్రం సాగుతుంది. ఈ మూవీలో టైటిల్ రోల్‌లో జోజు జార్జ్ నటించారు. రాజేష్ వర్మ అందించిన కథతో జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో  కల్యాణి ప్రియదర్శన్, చెంబన్ వినోద్ జోస్, నైలా ఉష, ఆశా శరత్, అప్పని శరత్, విజయరాఘవన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతమందించగా.. సినిమాటోగ్రఫర్‌గా రెనాదివ్, ఎడిటర్‌గా శ్యామ్ శశిధరన్ పని చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు