లేడీ జర్నలిస్టుకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన డైరెక్టర్ మారుతి!

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:57 IST)
ఓ మహిళా జర్నలిస్టుకు టాలీవుడ్ దర్శకుడు మారుతి దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ త్వరలో తల్లికాబోతోంది. అంటే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలోనే తండ్రికాబోతున్నాడు. అయితే, తల్లి కాబోతున్న అనుష్క తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. 'అతను మిమ్మల్ని తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌కు మహారాణిని చేయలేదు. మరీ, అంత సంబరపడక'ని కామెంట్ చేశారు. 
 
ఇది డైరెక్టర్ మారుతికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనిపై మారుతి స్పందిస్తూ, 'ఓ మహిళా జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్ చేయడం విచారకరం. ఇంగ్లండ్‌కు మహారాణి కావడం కంటే ఓ బిడ్డకు తల్లి కావడం ఓ మహిళకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అవును.. ప్రతి మహిళా ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లూ ఓ గొప్ప సామ్రాజ్యమే. ఆమె సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంద'ని రిప్లై ఇచ్చాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు