ఈ చిత్రంలో తొలి భాగం జనవరి 9వ తేదీన, రెండో భాగం జనవరి 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వస్తున్న వార్తలు ప్రేక్షకులకి అమితానందాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాలోని ముఖ్య పాత్రల కోసం పలువురు స్టార్స్‌ని ఎంపిక చేసిన చిత్ర బృందం అనుష్క శెట్టిని కూడా కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట.
ఎన్టీఆర్ సరసన బి.సరోజాదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈ బయోపిక్‌లో చూపిస్తున్నారట. ఈ క్రమంలో సరోజా దేవి పాత్ర కోసం అనుష్కని తీసుకున్నారట. అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనున్నారని అంటున్నారు.
అనుష్క చివరిగా 'భాగమతి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ మూవీ తర్వాత ఏ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం విశేషం. మరి ఎన్టీఆర్‌తో అనుష్క ప్రేక్షకులని పలకరిస్తుందని వస్తున్న వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.