అవకాశాలు కాకుండా ప్రాధాన్యత గల పాత్రలే ఎంచుకుంటున్నట్లు అనుష్క శర్మ తెలిపింది. మిగిలిన హీరోయిన్లలా కాకుండా.. విభిన్న పాత్రలను ఎంచుకోవడమే బాలీవుడ్‌లో తనకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అనుష్కశర్మ చెప్తోంది. ''తక్కువ సినిమాలు చేయడమే సౌకర్యంగా ఉంది. అయితే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయమని మొదట్లో నాకు చాలామంది సలహాలిచ్చేవారు.
కానీ ఎక్కువ సినిమాలు చేయాలనే టార్గెట్ పెట్టుకొని నటించాలని ఎప్పుడూ అనుకోలేదని అనుష్క శర్మ వ్యాఖ్యానించింది. తన కెరీర్‌కు బలాన్నిచ్చే పాత్రల్లోనే కనిపిస్తానని చెప్పుకొచ్చింది. గతేడాది అనుష్క నటించిన 'సుల్తాన్'.. 'యే దిల్‌హై ముష్కిల్' బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఆమె నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవలే 'ఫిల్లౌరీ' షూటింగ్ ముగించుకున్నానని అనుష్క చెప్పింది. ఇంతియాజ్ అలీ సినిమా 'ది రింగ్'(వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో ఉన్నానని వెల్లడించింది.