ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రముఖ క్రికెటర్ కోహ్లీ ప్రియురాలైన అనుష్క శర్మ తన తాజా మూవీలో పెళ్లికూతురి డ్రెస్లో మెరిసిపోనుంది. రంజాన్ ఈద్ సందర్భంగా ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న "సుల్తాన్" మూవీలోని ఓ ప్రత్యేక గీతం ''సాచి ముచీ"లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్లో కలిసి అలరించనున్నారు.
హర్యానాలో ప్రత్యేకంగా వేసిన ఓ వెడ్డింగ్ సెట్లో సంప్రదాయ వధువు దుస్తులతో అనుష్కపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. సంప్రదాయ చేనేత చికాన్కారితో పాటు జర్దోసి, కుందన్, గోటా, డబ్కా, నష్కీలతో ''దివానీ" లఫ్జ కలెక్షన్ ధరించిన అనుష్క ప్రేక్షకులను అలరించనుంది. సుల్తాన్ మూవీలో తన క్యారెక్టర్ అర్ఫా ద్వారా వినూత్న లుక్తో దర్శనమిస్తానని అనుష్క శర్మ చెప్తోంది. దివానీ అనేది ఫస్ట్ సినిమా ఇన్స్పైర్డ్ ఫ్యాషన్ బ్రాండ్ కావడం విశేషం.