తాను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చిత్ర పరిశ్రమను వీడిబోనని కోలీవుడ్ నటి అనుష్క స్పష్టం చేసింది. అలాగే, తనకు పుట్టే పిల్లలు కూడా సినిమా రంగంలోకి వెళ్తామని చెబితే, అందుకు సంతోషంగా అంగీకరిస్తానని తెలిపింది.
సినిమా రంగంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన వేళ, తాను చిత్రసీమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో సైతం ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, అత్యంత సురక్షితమైన రంగాల్లో సినిమా ఫీల్డ్ ఒకటని తాను బల్లగుద్ది చెప్పగలనని అంటోంది.