కాగా, ఓసారి మీడియాతోపాటు మాట్లాడుతూ, తనకూ క్రికెట్ అంటే పిచ్చి. ఆ టైంలో టీనేజ్‌లో వున్నా. రాహుల్ ద్రావిడ్ అంటే పిచ్చి ప్రేమ. అలాంటిది అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో ఇదో లోకం అయింది. అయితే ఇప్పుడు ఎవరితోనూ ప్రేమలో పడలేదనీ, ప్రస్తుతం నా కెరీర్ చూసుకోవడంలోనే టైం సరిపోతుందని అంటోంది. గతంలో ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇక ప్రభాస్‌కూ, అనుష్కకు మధ్య స్నేహంమాత్రమే, ప్రేమ లేదని ఇద్దరూ నొన్కి వక్కాణించారు. ఇద్దరికీ ఇష్టం అయితే నాకేం ఇబ్బంది లేదని అప్పట్లో కృష్ణం రాజు గారు అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయనతో ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో దాచుకుంది. మరి ముందు ముందు పెళ్లి ఇంకెన్ని విషయాలు చెబుతుందో చూడాలిమరి.