టాలీవుడ్ జేజమ్మ... అనుష్క సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు సందేశం పంపింది. 'సైరా' సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఆమె కాలికి గాయమయిందనీ... ఆవిడ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారని వార్తలు వచ్చాయి. కాగా... ఈ అంశంపై ఆవిడ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.