Pragya Jaiswal, Salman Khan
`కంచె` సినిమా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్‌కి సౌత్‌లో ప్రత్యేకంగా పరిచయాలేవీ అక్కర్లేదు. రీసెంట్‌గా అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ప్రగ్యా జోరు మరో రేంజ్‌లో ఉంది. 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా నటించిన అఖండ సినిమా జోరుతో నార్త్ లోనూ హల్‌చల్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. సల్మాన్ ఖాన్ సరసన మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్రగ్యా. ఈ పాటలో సల్మాన్, ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయిందని అంటున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పందన వస్తోంది.