ఆస్కార్‌పై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు.. చెత్త సినిమాలను పంపిస్తున్నారు..!

గురువారం, 16 మార్చి 2023 (15:34 IST)
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్పందించారు. దేశం నుంచి రాంగ్ సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని.. అందుకే మనకు ఆస్కార్స్ రావట్లేదని తెలిపారు. మనం పాశ్చాత్య సంగీతాన్ని వింటున్నప్పుడు.. వారు మన సంగీతాన్ని ఎందుకు వినడం లేదని రెహమాన్ ప్రశ్నించారు.
 
ఆర్ఆర్ఆర్ మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపించి వుంటే.. బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకు మరో ఆస్కార్ వచ్చేదని రెహ్మాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఆస్కార్ జ్యూరీకి సరైన సినిమాలను సెలక్ట్ చేయడంలో ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్‌కు విఫలమవుతుందన్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు