శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణంలో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు.