బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే ట్రైలర్ లక్ష లైక్‌లు కొట్టేసింది. తద్వారా లక్ష లైకులు పొందిన తొలి సినిమా ట్రైలర్‌గా నిలిచింది. గతంలో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్ర ట్రైలర్ 42 గంటల్లో, ఆమిర్ ఖాన్ 'దంగల్' ట్రైలర్ 23 గంటల్లో, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ 'ఎమ్.ఎస్. ధోని' 12 గంటల్లో లక్ష లైక్‌లు సాధించాయి.