అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం దేవకీ నందన వాసుదేవ షూటింగ్ పూర్తి

డీవీ

బుధవారం, 12 జూన్ 2024 (18:39 IST)
Ashok Galla, Varanasi Manasa, RASOOL ELLOR and others
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ 'దేవకి నందన వాసుదేవ' లో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్.  హనుమాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలై టీజర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ అల్బం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ఏమయ్యిందే, జై బోలో సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరించి మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.  
 
రసూల్ ఎల్లోర్‌తో పాటు ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో చాలా గ్రాండ్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.
 త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు