హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫ్లాట్‌ఫామ్ ఆహాలో వరుస బ్లాక్‌బస్టర్స్, వైవిధ్యమైన వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్నో హారర్ థ్రిల్లర్ ఆగస్ట్ 13న విడుదలవుతుంది. మంజు వారియర్, సన్నీ వేనె, శ్రీకాంత్ మురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని రంజిత్ కామల శంకర్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి మలయాళ మాతృక.. బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎఫ్ఏఎన్), చుంచియాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(సీఐఎఫ్ఎఫ్), మేలిస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్(ఎంఐఎఫ్ఎఫ్) ఇలా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను `ఆహా` గురువారం విడుదలైంది.